![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1106 లో.....నాకు ఎండీ కావాలని ఏంతుందో నీకు తెలుసు కదా ప్లీజ్ నాకు అడ్డురాకు.. ఇన్నిరోజులు ఎన్ని తప్పులు మోసాలు చేసినా.. అది కేవలం ఎండీ పదవి కోసమే కదా అని మనుని రిక్వెస్ట్ చేస్తాడు శైలేంద్ర. నీకు ఎండీ అయ్యే అర్హత లేదు. ముందు అది సాధించమని మను అంటాడు. అయితే ఒక డీలింగ్ కుదర్చుకుందామా అని శైలేంద్ర అంటాడు. ఏంటని మను అడుగుతాడు. నీ కన్నతండ్రి ఎవరో నేను కనుకున్నాను. నువ్వే కనుక్కో అన్నావ్ కదా అని శైలేంద్ర అనగానే.. ఎవరు నా తండ్రి అంటూ ఎక్సయిట్ మెంట్ తో మను అడుగుతాడు.
నువు నాకు ఎండీ పదవికి అడ్డు రాకు.. నేను నీ తండ్రి గురించి చెప్తానని శైలేంద్ర బ్లాక్ మెయిల్ చేస్తాడు. అయితే వద్దులే కానీ ఎండీ పదవి ఇచ్చేది లేదని మను అంటాడు. మరొకవైపు రౌడీలు వసుధార కోసం వెతుకుతుంటారు. వసుధార ఫోటో చూపిస్తూ అందరిని అడుగుతారు. అటుగా వెళ్తున్న రంగా ఫ్రెండ్ ని వసుధార ఫోటో చూపించి అడుగుతారు. తను కంగారుపడుతూ తెలియదు అంటాడు. మరొకవైపు నేను మను దగ్గరికి వెళ్లి మీ నాన్న గురించి చెప్తానంటే వాడు నమ్మడం లేదని దేవయానితో శైలేంద్ర అనగానే.. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావ్ రా .. ఇప్పుడు వాడు వెళ్లి మహేంద్రకి చెప్తాడు. మహేంద్ర మీ నాన్నకి చెప్తాడు. అసలు నిజం తెలిసాక ఈ ఇంటికి సరైన వారసుడు మను అని ఇక వాడిని ఎండీ చేస్తారు. ఎందుకిలా చేస్తున్నావ్ కొంచెం అలోచించి చెయ్యొచ్చు కదా అని శైలేంద్రని దేవయాని తిడుతుంది.
మరొకవైపు రంగాకి సరోజ క్యారేజ్ తీసుకొని వస్తుంది. కొద్దిసేపు ఆగొచ్చు కదా అని పెద్దావిడ అంటుంది. నేను ఆగలేను బావకి ప్రేమగా వడ్డించాలి. అప్పటివరకు నేను ఆగలేను నా మనసు ఆగలేదని సరోజ అంటుంది. ఈ అమ్మాయి ఎందుకు ఈ ప్రేమ చూపిస్తుంది. వీళ్లంతా రంగా అని ఎందుకు పిలుస్తున్నారని వసుధార అనుకుంటుంది. నువ్వు ఇలా ప్రేమగా వడ్డీస్తావ్.. మీ నాన్న వాడి దగ్గర వడ్డీలు వసులు చేస్తాడని పెద్దావిడ అనగానే.. నన్ను పెళ్లి చేసుకుంటే ఈ వడ్డీలు కట్టడం ఉండదని సరోజ అంటుంది. ఆ తర్వాత రంగా వస్తాడు. బావ నీకు ఇష్టమైంది వండుకొని వచ్చాను ఏంటో చెప్పమని సరోజ అనగానే.. రంగా ఆలోచిస్తుంటే బంగాళదుంప అని వసుధార చెప్తుంది. నీకెలా తెలుసని సరోజ అంటుంది. రిషి సర్ ఇష్టాలు తెలుసని వసుధార అంటుంది. పదండి భోజనం చేద్దామని పెద్దావిడ అనగానే.. నాకు వద్దని వసుధార వెళ్తుంది. ఆ తర్వాత వసు దగ్గరకి రంగా భోజనం తీసుకొని వెళ్తాడు. మీ డాడ్ అక్కడ మీ గురించి ఎంత బాధ పడుతున్నాడని వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.
![]() |
![]() |